యేసుక్రీస్తు దేవుడా? నేను నమ్మను! - Faith, Scope

యేసుక్రీస్తు దేవుడా? నేను నమ్మను!

von Faith, Scope

  • Veröffentlichungsdatum: 2017-12-05
  • Genre: Religion und Spiritualität

Beschreibung

యేసుక్రీస్తు దేవుడా? నేను నమ్మను! ఇది ఒక సాధారణ మనిషికి క్రైస్తవ తత్వానికి మధ్య జరుగుతున్న స్నేహపూర్వక చర్చ. యేసు ఎవరు? అంటే యేసు సృష్టికర్తయైన దేవుడా? నేను నమ్మను గాని, ఇంతకీ ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినట్లు? అంటే, పాపములో పడి చెడిపోయిన వారిని రక్షించుటకు మాత్రమే యేసు వచ్చారు అంటారు? ఇక్కడ అంతటి పాపులు ఎవరూ లేరండి. మాకు మీ యేసు అక్కరలేదు. అది బైబిల్ ప్రకారము కాబట్టి, మాకు అనుకరించదు. వేరే ఏదైనా పవిత్ర గ్రంధములో వుంటే చెప్పండి. కర్మ సిద్ధాంతము ప్రకారము ఎవరి పాపములకు వాళ్ళే బాధ్యులు, కృష్ణ భగవానుడే కర్మ ప్రభావాన్ని అనుభవించాడు. తన పూర్వ జన్మలో రాముడుగా, వాలిని వెనుకనుంచి చంపిన పాపానికి తిరిగి కృష్ణుడుగా జన్మించినప్పుడు వేటగాడుగా పుట్టిన వాలి చేతిలో చనిపోయాడు. అలాంటప్పుడు ఏసుక్రీస్తు అన్ని పాపములను కడుగ గలడా? నాకు ఏ మాత్రము నిజమనిపించుట లేదు. ఇంత మంది దేవుళ్ళు వుండగా ఏసుక్రీస్తును మాత్రమే ఎందుకు నమ్మాలి? సృష్టికర్తకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట న్యాయమే, కానీ నేను ఏసుక్రీస్తు మంచి మనిషి అంటే నమ్ముతా గాని దేవుడంటే నమ్మను! యేసు దేవుడు అని చెప్పిన గొప్ప జ్ఞానులు ఎవరైనా వున్నారా? స్వామి వివేకానంద యేసుక్రీస్తును తిరస్కరించిన వారికి మోక్షము లేదని చాలా మంది క్రైస్తవులు చెపుతారు? దేవుడు అంతటి కఠినాత్ముడా? ఏసుక్రీస్తు నిజమో కాదో, దేవుడో కాదో అని తెలియకపోయినా ఆయనను నమ్మి అనుసరించాలా? నేనంత మూర్ఖుడిని కాను. ఆయన నిజమైన దేవుడా కాదా అనే విషయము తెలియక ఆయనను నేను ఒప్పుకోవడం లేదు! యేసుక్రీస్తు నిజమైన దేవుడు, అని తెలిస్తే నేను ఎందుకు తిరస్కరిస్తాను? ఇంతకీ బైబిల్ నిజమని ఎవరు చెప్పారు? మీరింత చెప్పినా ఏసుక్రీస్తు మాత్రమే దేవుడు అనే నమ్మకము కుదరటము లేదు.